రాజధాని ఉద్యమకారులకు నేడు అభినందన సభ

ABN , First Publish Date - 2022-03-07T12:12:19+05:30 IST

అమరావతి రాజధాని సాధనకై న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు

రాజధాని ఉద్యమకారులకు నేడు అభినందన సభ

హైదరాబాద్ సిటీ/సత్తెనపల్లి : అమరావతి రాజధాని సాధనకై న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిగిన మహాపాదయాత్రలో పాల్గొన్న మహిళలకు, రాజధాని ఉద్యమకారులకు, అమరావతి జేఏసీ సారధులకు సోమవారం సత్తెనపల్లి జేఏసీ ఆధ్వర్యంలో అభినందన సభ జరగనుంది. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సత్తెనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఉదయం  9.30గంటలకు పట్టణంలోని గడియార స్థంభం నుంచి రఘురాంనగర్‌ వరకు ర్యాలీ జరుగుతుంది.  అనంతరం సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను జేఏసీ నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, మన్నవ వెంకట్రామయ్య, శారద, మందడి కాళీప్రసాద్‌, కొబ్బరి సుబ్బారావు, నర్శేటి వేణుగోపాల్‌, కొండ్రగుంట రంగారావు, పచ్చా సుధీర్‌, గన్నమనేని శ్రీనివాసరావు, ఒక్కం టి అజయ్‌, పచ్చల నాగేశ్వరరావు పర్యవేక్షించారు.


బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి..

హైకోర్టు తీర్పును గౌరవిస్తూ.. అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో  నిధులు కేటాయించాలని రాజధాని రైతులు డిమాండ్‌ చేశారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌,  రాష్ట్ర ఏకైక రాజధాని గా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని  రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారంతో 810వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును గౌరవించి అభివృద్ధి పనులను కొనసాగించాలన్నారు. అమరావతికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలని కోరారు. పనులు ప్రారంభిస్తే ఆదాయ వనరుగా అమరావతి మారుతుందన్నారు. రాజధాని 29 గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.

Updated Date - 2022-03-07T12:12:19+05:30 IST