May 11 2021 @ 14:11PM

అభిజీత్‌ తల్లికి కరోనా!

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం, బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజీత్‌ తల్లి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపారు. అమ్మకు కొవిడ్‌ పాజిటివ్‌ అన్న విషయం మంగళవారం తెలిసింది. ‘‘ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. కుటుంబ సభ్యులంతా పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్‌ బావున్నాయి. త్వరగానే కోలునికుంటుందని ఆశిస్తున్నా. ఈ వైరస్‌ మానసికరంగా జనాలకు పరీక్ష పెడుతుంది. నా  దృష్టిలో కరోనా సోకిన వారిని ఓ గదిలో బంధించినట్లు చేయకూడదు. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. మనం ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడడుకుంటే అంత మంచిది. నేను ఈ సమయాన్ని వృధా చేయకుండా బుక్స్‌ చదువుతున్నా. స్పానిష్‌ నేర్చుకుంటున్నా’’ అని అభిజీత్‌ తెలిపారు.