అభయాంజనేయ ఆలయంలో సందడి

ABN , First Publish Date - 2022-08-10T06:43:32+05:30 IST

అభయాంజనేయ ఆలయంలో సందడి

అభయాంజనేయ ఆలయంలో సందడి
అభయాంజనేయస్వామి ఆలయం వద్ద రహదారి వరకు భక్తుల క్యూ లైన్‌

మంగళవారం సెంటిమెంట్‌తో రోడ్డుపై క్యూ కట్టిన భక్తులు

హనుమాన్‌జంక్షన్‌, ఆగస్టు 9 : స్థానిక అభయాంజనేయస్వామి  ఆలయం మంగళవారం భక్తుల రద్దీతో సందడిగా మారింది. రద్దీగా ఉన్న సమయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌ వినియోగించకుండా  ఆలయం ఎదుటే రహదారిపై క్యూ కడుతున్నారు. మంగళవారం స్వామి దర్శనం సెంటిమెంట్‌గా మారడంతో ప్రతి మంగళవారం భక్తులతో ఇదే మాదిరిగా రద్దీగా మారుతోంది. భక్తుల క్యూ నాలుగు రోడ్ల కూడలి వరకు సాగుతుండడంతో రహదారి మీదుగా సాగే వాహనచోదకులు ఎక్కడ ప్రమాదాలకు గురవుతామోనన్న భయానికి లోన వుతున్నారు. రోడ్డు మీదకు వస్తున్న క్యూలైన్‌ విషయంలో ఇటు ఆలయ సిబ్బంది, అటు పోలీస్‌ సిబ్బంది స్పందించకపోవడం గమనార్హం. రద్దీ సమయంలో భక్తులు కోసం హనుమజయంతిని పురస్కరించుకుని దాతల సాయంతో పాలక మండలి కొత్తగా ఆలయం వెనుక భాగంలో  క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. కాని భక్తులు క్యూలైన్‌లో రాకుండా ఆలయం ఎదుటే రోడ్డు వరకు క్యూకడుతున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన క్యూలైన్‌ను వినియోగించేలా ఆలయ నిర్వాహాకులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-10T06:43:32+05:30 IST