Jul 24 2021 @ 14:50PM

నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం: హీరో అభయ్ సింహా

డైరెక్టర్ రవిబాబు ‘క్రష్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో అభయ్ సింహా. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన ‘కమిట్ మెంట్’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా హీరో అభయ్ సింహా మాట్లాడుతూ ‘‘ మా నాన్న సతీష్ గారు హీరోగా నెల్లూరి పెద్దారెడ్డి వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయన ఇన్సిపిరేషన్ తో నేనూ హీరో కావాలని అనుకున్నాను. డాన్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రవిబాబు గారు ‘క్రష్’ మూవీకి ఆడిషన్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆడిషన్ లో సెలెక్ట్ అవడంతో ఆ మూవీలో హీరోగా నటించే అవకాశం దక్కింది.

మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక నాకు మంచి పేరొచ్చింది. రొమాంటిక్ మూవీ కాబట్టి యూత్ ఆడియన్స్ ఎక్కువగా చూశారు. క్రష్ రొమాంటిక్ మూవీ అయినా కథలో అది భాగమే. కమిట్ మెంట్ సినిమా ఓ ఆంథాలజీగా అనుకోవచ్చు. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఇప్పటి హీరోల్లో నాకు ఎన్టీఆర్ నటన చాలా ఇష్టం. ఆయనలా మాస్, యాక్షన్ హీరో లా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాను. వాటిలో "సలీం అక్బర్ అనార్కలి" అనే మూవీ ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. మిగతా రెండు చిత్రాలు కూడా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొస్తాం’’ అన్నారు.