ఈ శాఖ పట్ల నాకు పూర్తి అవగాహన లేదు: Ab Venkateswara Rao

ABN , First Publish Date - 2022-06-17T17:09:49+05:30 IST

మూడేళ్ల అనంతరం తిరిగి బాధ్యతలు స్వీకరించానని, అయితే తనకు ఈ శాఖ పట్ల పూర్తి అవగాహన లేదని..

ఈ శాఖ పట్ల నాకు పూర్తి అవగాహన లేదు: Ab Venkateswara Rao

Vijayawada: మూడేళ్ల అనంతరం తిరిగి బాధ్యతలు స్వీకరించానని, అయితే తనకు ఈ శాఖ పట్ల పూర్తి అవగాహన లేదని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (Ab Venkateswara Rao) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముత్యాలంపాడులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌ (Printing press)కు గతంలో కీర్తి ఉండేదని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగం ఆదరణ పొందుతూ వచ్చిందన్నారు. విభజన తరువాత మిగిలిన ఈ విభాగంలోని స్థితి గతులను అధ్యానం చేస్తానన్నారు. గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు సయితం ఇక్కడ ప్రింటింగ్ అయ్యేవని, ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలపై సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రాధాన్యత లేని పోస్టింగ్‌గా తాను భావించడంలేదన్నారు. నియామకాల విషయంలె ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు కార్యాలయాన్ని పరిశీలించారు.


కాగా ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (Ab Venkateswara Rao)కు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆయనకు ప్రింటింగ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేస్‌ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఉన్న జీ.విజయ కుమార్‌ను హోమ్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. 

Updated Date - 2022-06-17T17:09:49+05:30 IST