Advertisement

Salman మూడేళ్ల కిందటి సెల్ ఫోన్ వాడతాడు... నేల మీద పడుకుంటాడు... ఎందుకో చెప్పిన బావమరిది

సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘అంతిమ్’. థియేటర్స్‌లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ భాయ్‌జాన్ ఫ్యాన్స్‌కు బాగానే నచ్చింది. అయితే, ‘అంతిమ్’లో సల్మాన్‌ది పరిమిత పాత్ర మాత్రమే. అసలు హీరో ఆయుష్ శర్మ. ఆయన నటనకి కూడా మంచి మార్కులే వేస్తున్నారు అభిమానులు. ఇక ఆయుష్ శర్మ ఎవరో తెలిసిందే కదా? సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్‌కు భర్త. అంటే... బాలీవుడ్ భాయ్‌జాన్‌కు బావమరిది అన్నమాట... 


‘అంతిమ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయుష్ శర్మ బావ సల్మాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెబుతూ వస్తున్నాడు. లెటెస్ట్‌గా బాలీవుడ్ కండల వీరుడి మొబైల్, బట్టలు, కార్ల గురించి గుట్టు విప్పాడు. అంతే కాదు, సల్మాన్ చాలా సింపుల్ అంటూ కామెంట్ చేసిన ఆయుష్ ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. సల్మాన్ అప్పుడప్పుడూ నేల మీదే పడుకుంటాడట. ఇందులో అంత సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అంటారా? బాలీవుడ్ స్టార్స్ చాలా మంది భారీగా బిల్డప్ ఇస్తుంటారు. తమ ఇళ్లలోనే ఫై స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు.  కానీ, సల్మాన్ మాత్రం ఇప్పటికీ తన మూడ్‌ని బట్టి ఇంట్లో ఫ్లోర్ మీదే పడుకుంటాడని ఆయుష్ అంటున్నాడు.


సల్మాన్ ఉపయోగించే సెల్ ఫోన్ సంగతి కూడా చెప్పాడు ఆయుష్ శర్మ. ఆయన రెండు, మూడేళ్ల పాత మోడల్ మొబైల్ యూజ్ చేస్తుంటాడట. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కొనటం అంటే అస్సలు ఆసక్తి ఉండదట. ఇక కొత్త బట్టలు, కొత్త కార్ల సంగతి కూడా అంతే అంటున్నాడు ఆయుష్. సంవత్సరానికి వందల కోట్లు సంపాదించే ‘టైగర్’ ఆఫ్ బాలీవుడ్ కాస్ట్యూమ్స్, కార్స్ విషయం కూడా పెద్దగా పట్టించుకోడట. ఇంట్లోని మిగతా వారే సల్మాన్ చేత అప్పుడప్పుడూ బలవంతంగా షాపింగ్ చేయిస్తుంటారట. కొత్త కార్లు కూడా ఎవరైనా వెంటపడితేనే సల్మాన్ కొంటాడట. లేదంటే, పాత కార్లతోనే పని కానిచ్చేస్తాడని ఆయుష్ చెబుతున్నాడు! 

Advertisement

Bollywoodమరిన్ని...