BROTHER vs భర్త : సల్మాన్ చెల్లెలి ఓటు ఎవరికంటే...

‘అంతిమ్’ సినిమాలో సల్మాన్‌తో మొదటి సారి కలిసి నటించాడు ఆయుష్ శర్మ. అయితే, ఆయుష్ మరెవరో అయితే ఇంత డిస్కషనే ఉండేది కాదు. ఆయన స్వయంగా సల్మాన్ చెల్లెలి భర్త. ఆయుష్‌ శర్మను అర్పితా ఖాన్ ప్రేమించి పెళ్లాడింది. అయితే, ‘అంతిమ్’ సినిమా సల్మాన్, ఆయుష్ మల్టీ స్టారర్‌గా విడుదలై హిట్ టాక్ సంపాదించుకోగలిగింది.


బావగారితో, బాలీవుడ్ సూపర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆనందంలో ఉన్న ఆయుష్ శర్మ తన భార్య మొదట్లో ఎలా ఫీలైందో కూడా వివరించాడు. ‘అంతిమ్’ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతోన్న దశలో అర్పితా ఖాన్ శర్మ ఏమన్నదంటే... ‘‘మిగతా అందర్నీ మా అన్నయ్యే మించిపోవాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. కానీ, ఇప్పుడు మొదటిసారి అన్నయ్యని మించిపోయేలా నువ్వు నటించాలని కోరుకుంటున్నాను!’’ 


‘అంతిమ్’ సినిమాలో లీడ్ రోల్ ఆయుష్ శర్మదే. సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో మాత్రమే తెరపై కనిపిస్తాడు. అయినప్పటికీ బాలీవుడ్ భాయ్‌జాన్ ఫ్యాన్స్ సినిమాని బాగానే ఆదరించారు. సల్మాన్ చెల్లెలు ఆశించినట్టుగా ఆయుష్ శర్మ తెరపై మరీ తేలిపోలేదు. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ ముందు కూడా ఆకట్టుకునేలా నటించి మెప్పించాడు... 

Advertisement

Bollywoodమరిన్ని...