ఆవ్రా లాబ్స్‌లో అడ్వెంట్‌కు మెజారిటీ వాటా

ABN , First Publish Date - 2022-01-25T08:16:49+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆవ్రా లేబొరేటరీ్‌సలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. దాదాపు 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్లు)కు ఈ వాటాను దక్కించుకున్నట్లు తెలిపింది..

ఆవ్రా లాబ్స్‌లో  అడ్వెంట్‌కు మెజారిటీ వాటా

ముంబై : హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆవ్రా లేబొరేటరీ్‌సలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. దాదాపు 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్లు)కు ఈ వాటాను దక్కించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆవ్రా లాబ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అడ్వెంట్‌ పేర్కొంది. ప్రముఖ శాస్త్రవేత్త ఏవీ రామారావు.. 1995లో ఆవ్రా లేబొరేటరీ్‌సను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ కంపెనీ క్రాంటాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, రీసెర్చ్‌ సర్వీసెస్‌ (క్రామ్స్‌), స్పెషాలిటీ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ)లో కార్యకలాపాలు సాగిస్తోంది. కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. 

Updated Date - 2022-01-25T08:16:49+05:30 IST