మహిళల సంక్షేమమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-20T04:47:12+05:30 IST

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనువాస్‌ అన్నారు.

మహిళల సంక్షేమమే లక్ష్యం
లంకలకోడేరులో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తున్న నిమ్మల, జడ్పీ చైర్మన్‌

జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనువాస్‌



నరసాపురం రూరల్‌, అక్టోబరు 19: మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనువాస్‌ అన్నారు.నరసాపురం, పాలకొల్లు మండలాల్లోని వేములదీవి ఈస్ట్‌, లంకలకోడేరు గ్రామాల్లో మంగళవారం ఆసరా చెక్కులను ఎమ్మెల్యే ప్రసాదరాజు, నిమ్మల రామానాయుడుతో కలిసి డ్వాక్రా మహిళలకు అందించి మాట్లాడారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము వేస్తున్నామన్నారు.ఎమ్మెల్యేలు డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, నరసా పురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, యడ్ల తాతాజీ, మేకా శేషుబాబు, ఎం . మైఖేల్‌ రాజు, ఎంపీపీలు చిట్టూరి కనకలక్ష్మి, జయలక్ష్మి, జడ్పీటీసీలు గోవింద రాజులు,బొక్కా రాఽధాకృష్ణ, జేవీఅర్‌, వైస్‌ ఎంపీపీ ఉంగరాల రమేష్‌నాయుడు, ఎంపీడీవోలు ప్రసాద్‌యాదవ్‌,సంగాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


కోరుకొల్లులో చెక్కులు పంపిణీ..


పాలకోడేరు, అక్టోబరు 19 : ప్రభుత్వం నిరంతరం మహిళల అభివృద్ధికి పాటుపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, జిల్లా యువజన వైసీపీ అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్‌ అన్నారు. కోరుకొల్లు గ్రామంలో మంగళవారం  డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఉప సర్పంచ్‌ చేకూరి ఆంజనేయరాజు, ఎంపీటీసీ తంగెళ్ళ మంజుల, గొట్టుముక్కల తిరుపతిరాజు,సీసీ రామచంద్రరావు, మహిళలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T04:47:12+05:30 IST