ఆరుష్‌కు ఆసియా చెస్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2021-08-03T09:23:40+05:30 IST

ఆసియా స్కూల్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప అండర్‌-7 బాలుర విభాగంలో తెలంగాణ బుడతడు బత్తుల ఆరుష్‌ రజతంతో మెరిశాడు...

ఆరుష్‌కు ఆసియా చెస్‌ టైటిల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా స్కూల్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప అండర్‌-7 బాలుర విభాగంలో తెలంగాణ బుడతడు బత్తుల ఆరుష్‌ రజతంతో మెరిశాడు. ఈ పోటీల్లో 25 దేశాలకు చెందిన 59 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన ఏడేళ్ల ఆరుష్‌ 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం తొమ్మిది గేమ్స్‌లో ఏడింట్లో విజయం సాధించిన ఆరుష్‌ ఒకటి డ్రా చేసుకోగా మరో గేమ్‌లో ఓటమి పాలయ్యాడు.

Updated Date - 2021-08-03T09:23:40+05:30 IST