ఆ ఘనత సాధించిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా ఫించ్!

ABN , First Publish Date - 2021-03-05T23:43:38+05:30 IST

ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదితన తొలి ఆసీస్ క్రికెటర్‌గా

ఆ ఘనత సాధించిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా ఫించ్!

వెల్లింగ్టన్: ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో ఇక్కడి స్కై స్టేడియంలో జరిగిన నాలుగో టీ20లో ఫించ్ ఈ ఘనత సాధించాడు. వంద, అంతకంటే ఎక్కువ సిక్సర్లు నమోదు చేసిన ఆటగాళ్ల ఓవరాల్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 135 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రోహిత్‌శర్మ (127), ఇయాన్ మోర్గాన్ (113), కోలిన్ మన్రో (107), క్రిస్ గేల్ (105) ఉన్నారు. 


పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఫించ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వార్నర్ ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా, ఫించ్ ఇప్పుడు అతడిని అధిగమించాడు. వార్నర్ 81 మ్యాచ్‌లలో 2,265 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫించ్ 70 ఇన్సింగ్స్‌లలో 2,310 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో పింఛ్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. ఫించ్ కెప్టెన్ ఇన్సింగ్స్‌తో ఆస్ట్రేలియా 50 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది.  

Updated Date - 2021-03-05T23:43:38+05:30 IST