Jul 22 2021 @ 22:07PM

ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నానంటోంది

యువ హీరోయిన్‌ ఆరా ‘పైసా’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఈ భామ ‘వన్‌వే’, ‘దేవదాస్‌ బ్రదర్స్‌’, ‘కుళలి’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే, వీటిలో ఏ ఒక్కటి కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ... కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ‘కుళలి’ సినిమాకు మాత్రం అనేక ప్రశంసలతో పాటు రివార్డులు, అవార్డులు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్నారు. వీటిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా, అనేక మంది ప్రశంసలు పొందుతోంది. 


అందుకే ఈ చిత్రంపై ఆరా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘కుళలి మూవీలో నేను ఓ గ్రామీణ యువతిగా నటించాను. ‘కాక్కాముటై’లో నటించిన విఘ్నేష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఒక గ్రామీణ యువతి చదవు కలను చెప్పే చిత్రం. ఈ చిత్రానికి ఇప్పటికే అనేక చిత్రోత్సవాల్లో మంచి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వరించాయి. ఇటీవల కూడా ఇండో ఫ్రెంచ్‌ చిత్రోత్సవంలో ప్రదర్శించగా, ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్‌ మ్యూజిక్‌ అవార్డును కైవసం చేసుకుంది. అందుకే ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను. ఖచ్చితంగా ఈ మూవీ తమిళ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. ఇది నా కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చింది.