భగవంత్ మాన్ టీమ్‌లో హేమాహేమీలకు దక్కని చోటు

ABN , First Publish Date - 2022-03-20T01:22:28+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలను మట్టికరిపించి జెయింట్ కిల్లర్స్‌గా నిలిచిన పలువురు 'ఆప్' నేతలకు..

భగవంత్ మాన్ టీమ్‌లో హేమాహేమీలకు దక్కని చోటు

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలను మట్టికరిపించి జెయింట్ కిల్లర్స్‌గా నిలిచిన పలువురు 'ఆప్' నేతలకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ ఛన్నీని బదౌర్ నుంచి 37,558 సీట్లతో ఓటించిన లాభ్ సింగ్ యుగోకె, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ప్రకాష్ సింగ్ బాదల్‌ను ఆయనకు కంచుకోట అయిన లంబి నుంచి 11,396 ఓట్ల తేడాతో ఓడించిన గుర్మీత్ సింగ్ ఖుద్దయిన్‌ సైతం ఉన్నారు. యుగోకె ఒకప్పుడు మొబైల్ రిపైర్ దుకాణం నడుపగా, ఖుద్దయిన్ గత ఏడాది కాగ్రెస్‌కు ఉద్వాసన చెప్పి ఆప్‌లో చేరారు.


కాగా, మంత్రివర్గంలో చోటుదక్కని వారిలో జీవన్ జ్యోత్ కౌర్ (50) సామాజిక కార్యకర్త. అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను, సాద్ నేత బిక్రం జిత్ మజితాయిని ఆయన ఓడించారు. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పాటియాలా అర్బన్ నుంచి ఓడించగా, జలాలాబాద్ నుంచి సాద్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను జగ్దీప్ కంబోజ్ ఓడించారు. రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన అమన్ అరోరా, బల్జీందర్ కౌర్, సర్వజిత్ కౌర్ మనుకేలకు కూడా తాజా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.


ఒక మహిళతో సహా 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు పంజాబ్ మంత్రివర్గంలో శనివారంనాడు చోటు కల్పించారు. హర్పాల్ సింగ్ చీమా, గుర్మీత్ సింగ్ మీత్ హయర్ మినహా తక్కిన 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్‌లో 18 మందికి చోటు ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను ఆప్ 92 సీట్లు గెలుచుకుని సంచలన విజయం సాధించింది. భగవంత్ మాన్ గత బుధవారంనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Updated Date - 2022-03-20T01:22:28+05:30 IST