Booth తప్పిపోయిన భగవంత్

ABN , First Publish Date - 2022-02-20T23:56:12+05:30 IST

ప్రచారం పర్వం ముగిసి పోలింగ్ బూత్‌కు వచ్చేసరికి నాయకులు సైతం ఒక్కోసారి..

Booth తప్పిపోయిన భగవంత్

చండీగఢ్: ప్రచారం పర్వం ముగిసి పోలింగ్ బూత్‌కు వచ్చేసరికి నాయకులు సైతం ఒక్కోసారి తడబడుతుంటారు. పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ సైతం ఆదివారంనాడు ఇలాంటి తొట్రుపాటుకే గురయ్యారు. సంగ్రూర్ జిల్లా దౌరి నియోజకవర్గం నుంచి మాన్ పోటీ చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన ఆయన ఒక పోలింగ్ బూత్‌కు బదులు వేరే బూత్‌కు వెళ్లారు. బూత్ నెంబర్ 154కు ఆయన వెళ్లాల్సి ఉండగా, 156వ బూత్‌కు వెళ్లారు. ఆ తర్వాత విషయం గ్రహించి తనకు కేటాయించిన బూత్‌కే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


దీనికి ముందు ఆయన మొహలిలోని గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ కలిపి ఆప్‌పైన, తనపైన ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ప్రజలకు అంతా తెలుసునని అన్నారు. పంజాబ్ అసెంబ్లీలోని మొత్తం 117 స్థానాలకు భారీ భద్రత మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. 2.14 కోట్ల మంది ఓటర్లు 1,304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2022-02-20T23:56:12+05:30 IST