ఒక్కసారి కొడితే వంద మైళ్లు

ABN , First Publish Date - 2020-07-21T05:30:00+05:30 IST

చాలా ఎత్తులో ఎగిరే గద్దను గమనించే ఉంటారు కదా! అది రెక్కలు ఆడించకుండా కాసేపు గాలిలో తిరుగుతూ ఉంటుంది. కానీ అండియన్‌ కాండర్‌ అనే పక్షి రెక్కలు కొట్టకుండా 100 మైళ్ల దూరం వెళ్లగలదు...

ఒక్కసారి కొడితే వంద మైళ్లు

చాలా ఎత్తులో ఎగిరే గద్దను గమనించే ఉంటారు కదా! అది రెక్కలు ఆడించకుండా కాసేపు గాలిలో తిరుగుతూ ఉంటుంది. కానీ అండియన్‌ కాండర్‌ అనే పక్షి రెక్కలు కొట్టకుండా 100 మైళ్ల దూరం వెళ్లగలదు.


స్వాన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఐదేళ్ల పాటు ఆ పక్షులపై పరిశోధనలు చేసి ఈ విషయం వెల్లడించారు. ఇంకా ఈ పక్షిలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ పక్షి బరువు సుమారు 16 కేజీలుంటుంది. రెక్కల పొడవు 3 మీటర్ల పైనే. ఇది ఒక్కసారి రెక్కలు ఆడిస్తే 5 గంటల పాటు గాలిలో ఉండగలదు. వంద మైళ్ల దూరం వెళ్లగలదు. ఇది రెండేళ్లకోసారి ఒక గుడ్డు పెడుతుంది. దీని జీవితకాలం 50 ఏళ్లు. కొన్ని ప్రదేశాల్లోని అండియన్‌ పక్షులు 60 ఏళ్లపాటు జీవిస్తాయి. అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్‌, వెనిజులా దేశాల్లో ఇవి కనిపిస్తాయి.


Updated Date - 2020-07-21T05:30:00+05:30 IST