Abn logo
Sep 18 2021 @ 22:47PM

ఆనకట్ట సమగ్ర సర్వేకి శ్రీకారం

సర్వే చేస్తున్న అధికారులు

8.67 ఎకరాలకు హద్దుల ఏర్పాటు

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 18: ఉదయగిరి ఆనకట్ట సమగ్ర సర్వేకి అధికారులు శనివారం శ్రీకారం చుట్టారు. గ్రామ కొలను పథకంలో ఆనకట్ట సుందరీకరణకు రూ.15 కోట్లు  మంజూరయ్యాయి. దీంతో పనులు చేపట్టేందుకు ముందుగా జిల్లా సర్వేయర్లు సమగ్ర సర్వే చేపట్టారు. సర్వే నెంబర్‌ 52లో 4.77, 45/2, 50లో 21.65, 47/2లో 0.59, 53/2లో 1.66 ఎకరాల చొప్పున మొత్తం 28.67 ఎకరాలు ఆనకట్టకు సంబంధించిన స్థలంగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. గతంలో 27.01 ఎకరాలు ఉండగా జిల్లా అధికారుల సర్వేలో 1.66 ఎకరాలు ఆదనంగా చేరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, ఇరిగేషన్‌ డీఈ రవి, ఏఈ విక్రమ్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి గౌస్‌బాషా, ఆత్మకూరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వెంకటేశ్వరరావు, సర్వేయర్లు శ్రీలత, రవి, మీరావలి, సచివాలయ సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

ఈఈ పరిశీలన

రూ.15 కోట్లతో చేపట్టిన ఉదయగిరి ఆనకట్ట సుందరీకరణ పనులను క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ నాగరాజు శనివారం పరిశీలించారు. ఆనకట్ట చుటూ కట్ట ఏర్పాటు పనులు పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్‌, ఇరిగేషన్‌ డీఈలు ఖాన్‌, రవి, ఏఈలు విక్రమ్‌, రమణయ్య, వైసీపీ మండల కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.