Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 14 Aug 2022 00:00:00 IST

అమీర్‌ సినిమాకి గట్టి దెబ్బ

twitter-iconwatsapp-iconfb-icon

అమీర్‌ ఖాన్‌... మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకొన్న కథానాయకుడు. అమీర్‌ ఓ సినిమా చేస్తున్నాడంటే.. దేశ వ్యాప్తంగా ఆసక్తి మొదలైపోతుంది. ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. ఒక్కో సినిమాపై ఏళ్ల తరబడి రీ సెర్చ్‌ చేసి, ఓ యజ్ఞంలా సినిమాని తీస్తుంటాడు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ విషయంలోనూ అదే జరిగింది. ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే ఓ అమెరికన్‌ చిత్రాన్ని అమితంగా ప్రేమించిన అమీర్‌ దాన్ని రీమేక్‌ చేయడానికి ఏళ్ల తరబడి విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి సాధించాడు. ఎంతో వ్యయ ప్రయాసల మధ్య రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. కానీ... బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా బోల్తా పడింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.13 కోట్లు మాత్రమే సాధించింది.


అమీర్‌ ఖాన్‌ చిత్రాల్లో ఇదే అల్పం. కథ, కథనాల్లో వైవిధ్యం లేకపోవడం, స్లో నేరేషన్‌ ‘లాల్‌ సింగ్‌..’కు ప్రతికూలంగా మారాయి. దాంతో పాటు... ‘బాయ్‌ కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా’ అనేది సోషల్‌ మీడియాలో ఓ ఉద్యమంగా నడుస్తోంది. గతంలో హిందూ మతానికి, ఆచారాలకూ వ్యతిరేకంగా అమీర్‌ చేసిన వ్యాఖ్యల ప్రతిరూపమే ఇది. అది కూడా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈనేపథ్యంలో ఈ చిత్ర కథానాయిక కరీనా కపూర్‌ స్పందించింది. ‘‘రెండేళ్ల కష్టం ఈ సినిమా. దయ చేసి ఎవరూ ఈ చిత్రాన్ని బాయ్‌ కాట్‌ చేయొద్దు. మొత్తం ప్రేక్షకుల్లో ఒక శాతం మాత్రమే  మా సినిమాని టార్గెట్‌ చేశారు. వాళ్లే నెగిటీవ్‌ ప్రచారం చేస్తున్నారు. దయచేసి మంచి సినిమాని ప్రేక్షకుల నుంచి దూరం చేయొద్దు’’ అని కరీనా కోరుతున్నారు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సినిమా డిజాస్టర్‌ లిస్టులోకి విశ్లేషకులు చేర్చేశారు. దాంతో బాలీవుడ్‌కి మరో గట్టి దెబ్బ తగిలినట్టైంది. ఈవారమే విడుదలైన అక్షయ్‌ కుమార్‌ ‘రక్షా బంధన్‌’ కూడా పరాజయం పాలైంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement