Abn logo
Jun 30 2020 @ 17:06PM

ఆమిర్ ఫ్యామిలీలో కరోనా కలకలం!

కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విస్తరిస్తూ భయాందోళనలు కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ముంబై నగరంలో ఈ వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుటుంబాన్ని కూడా కరోనా భయపెట్టింది. ఆమిర్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమిర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 


ఆ విషయం తెలిసిన వెంటనే ఆమిర్ కుటుంబంతోపాటు సిబ్బంది అందరూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారట. ఆమిర్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారట. అందరికీ నెగిటివ్ వచ్చిందట. అయితే తన తల్లికి ఇంకా పరీక్షలు చేయించాల్సి ఉందని, తన తల్లికి కూడా నెగిటివ్ రావాల్సిందిగా ప్రార్థన చేయండని ఆమిర్ విజ్ఞప్తి చేశాడు.  

Advertisement
Advertisement
Advertisement