Abn logo
Jul 6 2020 @ 11:13AM

భార‌త్‌-చైనా ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య అగ్ర‌హీరో షూటింగ్ ర‌ద్దు

న్యూఢిల్లీ: బాలీవుడ్ మిస్టర్ ప‌ర్ఫెక్షనిస్ట్ అమిర్‌ఖాన్ ఈ ఏడాది తన లాల్‌సింగ్ చద్దా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే క‌రోనా క‌ల్లోలం కార‌ణంగా ఈ చిత్రం షూటింగ్ పెండింగ్‌లో ప‌డింది. ఈ చిత్రం షూటింగ్ లధాఖ్‌లో జరగాల్సివుంది. అయితే భార‌త్, చైనాల‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల‌ కారణంగా లధాఖ్‌లో షూటింగ్‌ను అమిర్‌ఖాన్ రద్దు చేశారు. ఈ చిత్రం షూటింగ్ కార్గిల్‌లో చేస్తార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్ర‌యూనిట్ త్వ‌రలో తుది నిర్ణయం తీసుకోనున్న‌ద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు షూటింగ్ నిలిపివేయాల‌ను అమిర్‌ఖాన్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement