Abn logo
Nov 28 2020 @ 09:35AM

`ఆర్ఆర్ఆర్` కోసం ఆమిర్?

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, అజయ్‌దేవ్‌గణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కాబోతోంది. 


ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నారట. అలాగే హిందీలో స్టార్ హీరో ఆమిర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారట. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల ప్రయాణాన్ని ఆమిర్ వినిపించనున్నారట. ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` టీమ్ ఆమిర్‌ను సంప్రదించిందని, వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఆయన సమ్మతించారని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement