Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలూ బ్రెడ్‌ రోల్స్‌

కావలసిన పదార్థాలు: బ్రెడ్డు ముక్కలు - నాలుగు, ఆలు - రెండు, పచ్చి బఠానీ- అర కప్పు (ఉడికించినవి), జీలకర్ర- అర స్పూను, కారం- అర స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు- స్పూను, నీళ్లు, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ఆలుగడ్డను ఉడికించి ముద్దలా చేయాలి. ఓ పాన్‌లో నూనె వేసి జీలకర్ర, పచ్చి బఠానీలు, మిర్చి వేసి వేయించాలి. రెండు నిమిషాల తరవాత ఆలుగడ్డ,  కారం, ఉప్పు కూడా వేసి బాగా కలపి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక రెండు స్పూన్ల కూరని పొడుగాటి ముద్దలుగా వత్తి పక్కన పెట్టాలి. ఇలా పన్నెండు ఆలూ రోల్స్‌ అవుతాయి. బ్రెడ్డు ముక్కల కొనల్ని తీసేసి సగానికి కట్‌ చేసుకోవాలి. ఒక్కో బ్రెడ్డు ముక్కని నీళ్లలో ముంచి, నీటినంతా పిండేసి ఆలూ రోల్‌పై చుట్టాలి. ఇలా అన్నిటినీ చుట్టేసి నూనెలో వేయిస్తే ఆలూ బ్రెడ్‌ రోల్స్‌ రెడీ.

మకర చౌలా మినప్పప్పు కచోరీ దహీ కే కబాబ్‌ఆమ్లా జాట్జికిపనీర్‌ గార్లిక్‌ సాస్‌వెజ్‌ జాల్‌ఫ్రెజీపనీర్‌ దోశక్యారెట్‌ పొరియల్‌డయాబెటిస్‌ను నియంత్రించే ములక్కాడల కూరపెసరపప్పు పకోడా
Advertisement