Jul 9 2021 @ 12:52PM

'ఆకాశవాణి' నుంచి 'దిమ్‌సారె..' లిరికల్ సాంగ్ రిలీజ్

రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు  తెరకెక్కించిన చిత్రం 'ఆకాశవాణి'. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా నుంచి దిమ్‌సారె..' లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. గూడెంలోని జనం సంతోషంగా జాతర జరుపుకునే సందర్భంలో వచ్చే పాట అని విజువల్స్‌ను చూస్తే అర్థమవుతుంది. కాల భైరవ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి పాడగా, అనంత్‌ శ్రీరామ్‌ సంగీతం అందించారు. థియేటర్స్‌లో సినిమాలు విడులకు సన్నద్ధమవుతున్న సందర్భంలో ఆకాశవాణి రిలీజ్ డేట్‌పై త్వరలోనే ప్రకటన వస్తుందని సినీ వర్గాల సమాచారం.