రాజకీయాలకు ఆజాద్‌ గుడ్‌బై!

ABN , First Publish Date - 2022-03-22T08:16:03+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా! సోమవారం ఆయన ...

రాజకీయాలకు ఆజాద్‌ గుడ్‌బై!

  •  రిటైర్మెంట్‌పై సంకేతాలిచ్చిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత


న్యూఢిల్లీ, మార్చి 21: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా! సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే సంకేతాన్నిస్తున్నాయి. ఆజాద్‌కు పద్మభూషణ్‌ లభించిన నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ఓ సంస్థ ఆయనను సత్కరించింది. ఈ సందర్భంగా ఆజాద్‌ మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించి సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు అసహ్యంగా తయారయ్యాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-03-22T08:16:03+05:30 IST