Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 17:47:01 IST

ఆదికి కెరీర్‌ బెస్ట్ సినిమా ఇస్తానని చెప్పా.. ఇస్తున్నా: Tees Maar Khan నిర్మాత

twitter-iconwatsapp-iconfb-icon

ఆది సాయికుమార్ (Aadi Saikumar) హీరోగా, పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్‌గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 3గా దర్శకుడు కల్యాణ్ జి గోగణ దర్శకత్వంలో డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన చిత్రం ‘తీస్ మార్ ఖాన్’ (Tees Maar Khan). ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా.. తాజాగా మేకర్స్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. యంగ్ హీరోలు అడవి శేష్ (Adivi Sesh), సుధీర్ బాబు (Sudheer Babu), సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) వంటి వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  


ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘అడగ్గానే వచ్చిన మా మేజర్‌(అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే(సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. 1996 ఆగస్ట్ 16న పోలీస్ స్టోరీ కన్నడలో విడుదలైంది. తెలుగులో డిసెంబర్ 19న విడుదలైంది. మా అబ్బాయి‌ని ఇప్పటి వరకు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ‘తీస్ మార్ ఖాన్’ అంటూ వస్తున్నాడు. మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. వారికి విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. ప్రేక్షకుల ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా ఘన విజయం సాధించాలి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అని తెలిపారు. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఆది సరికొత్తగా కనిపిస్తున్నాడు.. అతనికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని అన్నారు.


‘‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్‌గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్ర సక్సెస్‌తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్‌లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్‌ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’’ అని ‘మేజర్’ హీరో అడివి శేష్ తెలిపారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... ’’ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఆదికి ఇది పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్‌గారితో నేను ‘భలే మంచిరోజు’ చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్‌లో తండ్రిలాంటి వారు. డైరెక్టర్ కళ్యాణ్ గారి మాటలుబట్టి ఈ చిత్రం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. (Tees Maar Khan Pre Release Event)

నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..‘‘ఆదికి కెరీర్ బెస్ట్ సినిమా ఇస్తానని చెప్పాను. ఇస్తున్నాను. ఈ సినిమాతో ఆది.. నాకు మంచి స్నేహితుడిలా మారిపోయాడు. సాయి కార్తీక్ ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు. తీస్ మార్ ఖాన్ అనేది మా టీంకు బెస్ట్ మూవీ అవుతుంది. ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాను’’ అని తెలుపగా.. డైరెక్టర్ కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆదిగారికి, నిర్మాతకు థ్యాంక్స్. కథ చెప్పగానే నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం, సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటిర్, కెమెరామెన్ ఇలా అందరూ అద్భుతం చేశారు. రాకేందు మౌళి, భాస్కర భట్ల మంచి పాటలు అందించారు. సునీల్ గారి పాత్ర చాలా బాగుంటుంది. ఎప్పుడూ చూడని సునీల్‌ను చూస్తారు.  పూర్ణ గారు అసలు తీస్ మార్ ఖాన్. కబీర్ సింగ్ అద్బుతంగా నటించారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్..’’ అని అన్నారు.


చిత్ర హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థ్యాంక్స్. ఆగస్ట్ 19న ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. పక్కా కమర్షియల్ చిత్రం. చాలా రోజుల తరువాత అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తున్నాను. మంచి ఎమోషన్‌ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కళ్యాణ్‌కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది. సాంకేతిక నిపుణులంతా ప్రాణం పెట్టేశారు. సినిమాను చూసి ఆశీర్వదించాలని ప్రేక్షకులని కోరుతున్నాను..’’ అని అన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని సంగీత దర్శకుడు సాయికార్తీక్ కోరారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement