కర్ణాటకలో భూములకు ఆధార్‌ తరహా నెంబర్లు

ABN , First Publish Date - 2022-01-25T07:44:28+05:30 IST

భూముల రికార్డులను సులభతరంగా గుర్తించడంతోపాటు

కర్ణాటకలో భూములకు ఆధార్‌ తరహా నెంబర్లు

బెంగళూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): భూముల రికార్డులను సులభతరంగా గుర్తించడంతోపాటు ఆక్రమణలను అరికట్టేందుకు ఆధార్‌ కార్డు తరహాలో నెంబర్లను కేటాయించాలని  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెవెన్యూశాఖ కసరత్తు చేస్తోంది. ప్రతి భూమికి ప్రత్యేక నెంబరును యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబరు (యూఎల్‌పీఎన్‌)  కేటాయిస్తుంది. ఒక భూమికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తారు. రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తిస్తారు. ఒకసారి యూఎల్‌పీఎన్‌ను కేటాయిస్తే మార్పులు చేసేందుకు వీలుండదు.


Updated Date - 2022-01-25T07:44:28+05:30 IST