ఆధార్‌ నవీకరణ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-09-29T03:30:45+05:30 IST

ఆధార్‌ నవీకరణ తప్పనిసరి అని యూఐడీఏఐ రీజనల్‌ అసిస్టెంట్‌మేనేజర్‌ మొహమ్మద్‌ సుభాన్‌ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్‌ మండలం అడ గ్రామంలో ఆధార్‌ కార్డు నవీకరణ స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ 2015కంటే ముందు ఆధార్‌కార్డు పొందిన వారు యూఐడీ ఏఐ ఆదేశాల మేరకు తగిన గుర్తింపు పత్రంతో స్థానికతను మరోసారి నవీ కరించుకోవాలన్నారు.

ఆధార్‌ నవీకరణ తప్పనిసరి
నవీకరణ పత్రం అందజేస్తున్న మొహమ్మద్‌ సుభాన్‌

 ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28: ఆధార్‌ నవీకరణ తప్పనిసరి అని యూఐడీఏఐ రీజనల్‌ అసిస్టెంట్‌మేనేజర్‌ మొహమ్మద్‌ సుభాన్‌ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్‌ మండలం అడ గ్రామంలో ఆధార్‌ కార్డు నవీకరణ స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ 2015కంటే ముందు ఆధార్‌కార్డు పొందిన వారు యూఐడీ ఏఐ ఆదేశాల మేరకు తగిన గుర్తింపు పత్రంతో స్థానికతను మరోసారి నవీ కరించుకోవాలన్నారు. ఈసందర్భంగా ఆధార్‌కార్డు నవీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లామేనేజర్‌ గౌతంరాజ్‌, టీఎస్‌టీఎస్‌ జిల్లా మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌, ఆధార్‌కేంద్రం నిర్వాహకులు సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T03:30:45+05:30 IST