మార్చి 31 గడువు సమీపిస్తోంది

ABN , First Publish Date - 2020-03-22T06:27:01+05:30 IST

పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చిం ది. తుది గడువును పొడిగించుకుంటూ వచ్చింది. తాజాగా 2020 మార్చి 31వ తేదీ ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి తుది గడువు.

మార్చి 31 గడువు సమీపిస్తోంది

ఆధార్‌-పాన్‌ అనుసంధానం

పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చిం ది. తుది గడువును పొడిగించుకుంటూ వచ్చింది. తాజాగా 2020 మార్చి 31వ తేదీ ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి తుది గడువు. ఈ గడువులోపు ఈ రెండింటినీ లింక్‌ చేయకపోతే పాన్‌ పని చేయకుండా పోతుంది. అయినా ఇదే పాన్‌ నెంబర్‌తో లావాదేవీలు నిర్వహిస్తే ఆదాయ పన్ను శాఖ జరిమానా విధించనుంది. ఇప్పటికే చాలా మంది తమ పాన్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి ఉంటారు. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని వారు గడువు తేదీ తర్వా త బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆదాయ పన్ను శాఖ రూ.10,000 వరకు జరిమా నా విధించే అవకాశం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని సార్లు కూడా జరిమానా పడే అవకాశం ఉండవచ్చు. అందుకే వెంటనే పాన్‌, ఆధార్‌ను అనుసంధానం చేసేయండి. మీరు మీ ఆదాయ రిటర్నును ఫైల్‌ చేయాలంటే ఈ రెం డింటి అనుసంధానం తప్పనిసరి. బ్యాంకు ఖాతా ప్రారంభానికి, స్థిరాస్తుల క్రయవిక్రయాలకు, రుణ దరఖాస్తుకు, క్రెడిట్‌ కార్డు దరఖాస్తుకు, పెట్టుబడులకు పాన్‌ అవసరం ఉంటుంది. మీరు చాలా తక్కువ సమయంలోనే పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు. http://www. incometaxindiaefiling.gov.in/ homeను ఓపెన్‌ చేయండి.  అందులో పాన్‌, ఆధార్‌ తదితర వివరాలు ఎంటర్‌ చేయడం ద్వా రా ఈ రెండింటినీ అనుసంధానం చేయవచ్చు. 


టాక్స్‌ రిటర్నుల ఫైలింగ్‌

ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్‌)ను గడువు తర్వాత ఫైల్‌ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి (2019 -20 అసె్‌సమెంట్‌ సంవత్సరం) టాక్స్‌ రిటర్నుల ఫైలింగ్‌ గడువు 2019 జూలై 31. దీన్ని నెల రోజులు పొడిగించారు. ఒకవేళ ఈ గడువు వరకు ఫైలింగ్‌ చేయని వారికి ఉండే గడువు 2019 డిసెంబరు 31. అప్పుడు కూడా ఫైలింగ్‌ చేయని వారికి తుది డెడ్‌లైన్‌ 2020 మార్చి 31. దీనికి జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మీ ఆదాయం రూ.5 లక్షలకన్నా తక్కువ ఉండి లేటుగా ఫైలింగ్‌ చేస్తే రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుం ది. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షలు దాటి ఉంటే మీరు మార్చి 31 వరకు ఫైలింగ్‌ చేసినప్పుడు జరిమానా రూ.10,000 వరకు ఉండవచ్చు. ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకుండా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడితే ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి గడువులోపు మీ రిటర్నులను సమర్పించే పనిపై దృష్టిపెట్టడం మంచిది. 


పీఎంఏవై వడ్డీ సబ్సిడీ 

గృహ రుణంతో మొదటిసారిగా అందుబాటు ధరల్లో ఇంటిని కొనుగోలు చేసే వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనా-అర్బన్‌ స్కీమ్‌ (పీఎంఏవై) కింద వడ్డీ సబ్సిడీని పొందడానికి అవకాశం ఉంటుంది. 4 రకాల ఆదాయ కేటగిరీల్లో ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో మధ్య ఆదా య గ్రూప్‌-1, మధ్య ఆదాయ గ్రూప్‌ -11 కింద వచ్చే మార్చి 31 వరకు ఈ పథక ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 


వీటి గురించి మరిచిపోకండి

మార్చి 31 దగ్గర పడుతోంది. ఈ తేదీతో 2019-20 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ తేదీ కొన్నింటికి డెడ్‌లైన్‌గా ఉంది. అవే మిటో తెలుసుకుంటే కొన్ని రకాల సమస్యలు, జరిమానాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. వాటి గురించి చూద్దాం..


పన్ను ఆదా పెట్టుబడులు

కొన్ని రకాల పెట్టుబడులు, బీమా పాలసీల కొనుగోలు ద్వారా ఆదాయ పన్ను చట్టం కింద మినహాయింపులు పొందవచ్చు. ఆదాయ పన్ను  చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను చెల్లింపుదారులు రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు పొందవచ్చు. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ కింద పెట్టుబడి పెట్టి సెక్షన్‌ 80సీసీడీ కింద రూ.50,000 వరకు మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్ను భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే మీకు మినహాయింపులు లభించే వాటిలో మార్చి 31లోగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 


పీఎంవీవీవై

ప్రధాన మంత్రి వయ వందన యోజనా (పీఎంవీవీవై) పెన్షన్‌ పథకంలో చేరడానికి, దీని కింద ప్రయోజనాలు అందుకోవడానికి మార్చి 31 చివరి గడువు. అధిక వడ్డీతో మంచి ప్రయోజనాలు అందిస్తున్న పథకమిది. కాబట్టి సీనియర్‌ సిటిజన్లు ఈ అవకాశాన్ని వదులుకోకండి. 

Updated Date - 2020-03-22T06:27:01+05:30 IST