ఓటుకు ఆధార్‌ లింక్‌లో వలంటీర్లు వద్దు

ABN , First Publish Date - 2022-08-12T05:55:13+05:30 IST

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఓటుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియకు నియోజకవర్గంలో వలంటీర్లు స్వయంగా ఓటురు వద్దకు వెళ్లి ఓటరుకార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ను తీసుకెళుతున్నారని టీడీపీ నాయకులు ఆర్డీఓ తిప్పేనాయక్‌కు ఫిర్యాదు చేశారు.

ఓటుకు ఆధార్‌ లింక్‌లో వలంటీర్లు వద్దు
ఆర్డీఓ తిప్పేనాయక్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

ఆ మేరకు ఆదేశాలు జారీ చేయండి

ఆర్డీఓకు టీడీపీ నాయకుల వినతి

ధర్మవరంరూరల్‌, ఆగస్టు11: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఓటుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియకు నియోజకవర్గంలో వలంటీర్లు స్వయంగా ఓటురు వద్దకు వెళ్లి ఓటరుకార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ను తీసుకెళుతున్నారని టీడీపీ నాయకులు ఆర్డీఓ తిప్పేనాయక్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై గట్టి చర్యలు తీసుకుని ఎన్నికల సంఘం ఆదేశాలను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ తిప్పేనాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లా డుతూ... ఓటుకు ఆధార్‌అనుసంధాన ప్రక్రియలో నియోజకవర్గంలో ఎక్కడా బూత లెవల్‌ అధికారులు పాల్గొనడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధర్మవరం నియోజకవర్గంలో చట్టాన్ని ఉల్లంఘించి వలంటీర్లు ప్రవర్తిస్తున్నా వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నియోజకవర్గ వ్యాప్తంగా వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆర్డీఓను కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఎవరి జోక్యం లేకుండా కేవలం బూతలెవల్‌ అధికారులు పాల్గొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  అలాకాకుండా ఇలాగే వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో కొనసాగితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వినతిపత్రం అందించిన వారిలో టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి పురుషోత్తంగౌడ్‌, నాయకులు పరిసే సుధాకర్‌, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు, అంబటిసనత, నాగుర్‌హుస్సేన, బోయ రవిచంద్ర, టైలర్‌ కుళ్లాయప్ప, షరీఫ్‌, బొట్టు క్రిష్ట, సాహెబ్బీ తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-08-12T05:55:13+05:30 IST