తణుకులో రేషన్ కేవైసీ కష్టాలు

ABN , First Publish Date - 2021-08-25T20:09:12+05:30 IST

ఏపీలో రేషన్ కార్డు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రహసనంలా మారింది.

తణుకులో రేషన్ కేవైసీ కష్టాలు

ప.గో.జిల్లా: ఏపీలో రేషన్ కార్డు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రహసనంలా మారింది. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈకేవైసీ చేసుకోవడం కోసం ఇబ్బందులు పడుతున్నారు. తణుకులో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆధార్ ఫోన్ అనుసంధానం కోసం ఆధార్ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద ప్రజలు.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారు. టోకెన్లకోసం రాత్రి వేళల్లో వచ్చి క్యూ లైన్లలో నిద్రపోతున్నారు.


ఆధార్‌తో ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని వాలంటీర్లు చెప్పడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్ సెంటర్లకు క్యూకడుతున్నారు. ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను పెంచాలని లబ్దిదారులు కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-25T20:09:12+05:30 IST