మళ్లీ ఆధార్‌ అవస్థలు..!

ABN , First Publish Date - 2021-10-26T05:50:13+05:30 IST

ప్రజలకు ఆధార్‌ అవస్థలు తప్పడం లేదు.

మళ్లీ ఆధార్‌ అవస్థలు..!
రాచర్ల పోస్టాఫీస్‌ వద్ద ఆధార్‌ కోసం బారులు తీరిన ప్రజలు

తలనొప్పిగా మారిన ఈకేవైసీ 

సుదూర ప్రాంతాల నుంచి రాచర్లకు 

పోస్టాఫీస్‌ వద్ద బారులు తీరుతున్న ప్రజలు

రోజంతా నిరీక్షణ

స్పందించని అధికారులు

అన్ని మండల కేంద్రాల్లో 

సెంటర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

రాచర్ల, అక్టోబరు 25 : ప్రజలకు ఆధార్‌ అవస్థలు తప్పడం లేదు. నెలలు గడుస్తున్నా ఆధార్‌ కేంద్రాలు అనేక మండల కేంద్రాలలో లేకపోవడంతో చిన్నారుల దగ్గరి నుంచి వృద్ధుల వరకు ఆధార్‌ కోసం కిలోమీట ర్లు వెళ్లి నిరీక్షించి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఆధార్‌ లేనిదే ఏ పనీ చేయవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ అత్యవసరంగా మారింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రేషన్‌కార్డులు, వృద్ధాప్య పింఛన్‌లకు సంబంధించి లబ్ధిదారుల పేరులు తొలగించారు. ఈకే వైసీ, ఆధార్‌ లింక్‌లు సరిచేసుకోవా లని నిబంధన వి ధించారు. దీంతో చేసేది లేక గ్రామస్థులు ఆధార్‌ కేం ద్రాల వద్దకు క్యూ కడుతు న్నారు.  అంతేకాకుండా విద్యార్థులకు పాఠశాలలో త ప్పనిసరిగా బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని చూస్తున్నారు. దీంతో అమ్మఒడి పొందాలంటే బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడాలి. అది జరగాలంటే తప్పనిసరిగా ఆధార్‌ లింక్‌ అయి ఉండాలి. ఇప్పటిదాకా ఆధార్‌ అప్‌డేట్‌ కానివారు తాజా నిర్ణయంతో ఆధార్‌ అప్‌డేట్‌ కోసం పరుగు తీస్తున్నారు. చిన్న వయసులో ఆధార్‌ నమోదు చేయిం చుకున్న విద్యార్థులు అప్‌డేట్‌ కోసం ఆధార్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే పిల్లలతో తల్లిదండ్రులు నిరీక్షించాల్సిన దుస్థితి నెల కొంటోంది. రాచర్ల పోస్టాఫీసులో ఆధార్‌ కోసం ప్రజ లు బారులు తీరుతున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఒక్క రాచర్ల మండలంలోని పోస్టాఫీస్‌లోనే ఆధార్‌ కేంద్రం ఉండడంతో కొమరోలు మం డలం అల్లినగరం నుంచి, గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట నుంచి, అర్ధవీడు మండలం పాపినేనిపల్లి నుంచి, కంభం, విద్యార్థులు, ప్రజలు ఆధార్‌ కోసం రాచర్ల పోస్టాఫీస్‌కే  వస్తున్నారు. దీంతో నిత్యం రద్దీ ఎక్కువ ఉంటోంది. రోజులతరబడి ఆధార్‌ పని పూర్తి కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల బేస్తవారపేటలో కేంద్రాన్ని ప్రారంభించడంతో అక్కడి నుంచి వచ్చేవారి సంఖ్య తగ్గింది.  ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రాల్లో ఆధార్‌ సెంటర్‌లను ఏర్పాటు చే యాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-10-26T05:50:13+05:30 IST