ఆ నాలుగు డాక్యుమెంట్లు లేకపోతే రెమ్డిసివిర్ కొనలేరు..!

ABN , First Publish Date - 2020-07-11T23:07:38+05:30 IST

కరోనా రోగి బంధువులు లేదా రోగికి సేవ చేసే వారెవరైనా మందుల దుకాణాల్లో రెమ్డిసివిర్ కొనాలంటే ఇకపై తప్పనిసరిగా రొగి కరోనా రిపోర్ట్ చూపించాలని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆ నాలుగు డాక్యుమెంట్లు లేకపోతే రెమ్డిసివిర్ కొనలేరు..!

ముంబై: కరోనా రోగి బంధువులు లేదా రోగికి సేవ చేసే వారెవరైనా మందుల దుకాణాల్లో రెమ్డిసివిర్, టోసిలిజ్యూమాబ్ కొనాలంటే ఇకపై తప్పనిసరిగా రొగి కరోనా రిపోర్ట్ చూపించాలని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా రిపోర్టుతో పాటు రోగి ఇచ్చిన కన్సెంట్ ఫారమ్, ఆథార్ కార్డు, డాక్టర్ ఇచ్చిన మందుల చీటీ కూడా రెమ్డిసివిర్ కొనేందుకు తప్పనిసరి చేసింది. ఈ నాలుగూ లేకుండా కరోనా ఔషధం కొనుగోలు సాధ్యం కాదని తెలిపింది. కరోనా పేరుతో కొందరు చౌకధరకు ఈ మందును కొని అధిక ధరకు అమ్ముకుంటూ లాభాలను గడిస్తున్నారని, ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కొత్త నిబంధనల ఉద్దేశ్యమని మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగే పేర్కొన్నారు. దీని ద్వారా కరోనా ఔషధాల విక్రయాలపై గట్టి నిఘా పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. అయితే కొందరు డాక్టర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల రోగులకు సేవ చేసే వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-07-11T23:07:38+05:30 IST