Mar 5 2021 @ 22:59PM

‘ఆచార్య’... పూర్తి చేశా!

‘ఆచార్య’లో రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే, చిత్రబృందం ఇప్పటివరకూ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, తాను ‘ఆచార్య’లో నటిస్తున్నట్టు పూజా హెగ్డే చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడిమిల్లిలో తండ్రీతనయులు చిరంజీవి, రామ్‌చరణ్‌ సహా ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే సైతం పాల్గొన్నారు. తాజా షెడ్యూల్‌లో శుక్రవారంతో చరణ్‌ సహా ఆమె పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ ముగిసింది. ‘‘అందమైన ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆచార్య’ షెడ్యూల్‌ పూర్తి చేశా’’ అని పూజా హెగ్డే పేర్కొన్నారు. రామ్‌ చరణ్‌ సైతం హైదరాబాద్‌ తిరిగొచ్చారు.