Abn logo
Mar 7 2021 @ 17:11PM

'ఆచార్య' తొలిసాంగ్‌ వచ్చేది అప్పుడే..!

మెగాభిమానులు మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ 'ఆచార్య' అప్‌డేట్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను మార్చి 11న విడుదల చేయబోతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి అందించే గిఫ్ట్‌ ఇదేనని అంటున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సాంగ్స్‌ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. మే 13న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రంలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ..'సిద్ధ' అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్‌గానే, రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణను మారేడుమిల్లి అడవుల్లో పూర్తి చేశారు. చరణ్‌ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.  సక్సెస్‌ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ మరోసారి మెగాస్టార్‌ సరసన నటిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement