Abn logo
Aug 1 2020 @ 09:42AM

అల్లు అర్జున్ 21కి స్ఫూర్తి అదేనా?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని నిర్మించనున్నారు. ఆయన దర్శకుడు కొర‌టాల‌కు  సన్నిహితుడు. అలాగే అల్లు అర్జున్‌ స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి జీఏ2 పిక్చర్స్‌ సారథ్యంలో చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.  ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేపుతుంది. ఇద్ద‌రు వ్య‌క్తులు న‌దికి అవ‌త‌ల ఉన్న ఓ ప్రాంతాన్ని తీక్ష‌ణంగా చూస్తుంటారు. 


అస‌లు ఈ సినిమా క‌థ ఏమై ఉంటుంద‌ని అంద‌రూ ఆలోచిస్తున్న త‌రుణంలో ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. విశాఖ‌లో జ‌రిగిన గ్యాస్ లీకేజీ త‌ర‌హా పాయింట్‌తో అల్లు అర్జున్ 21 తెర‌కెక్కుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓ ప్రాంతంలో కొంత మంది వ్య‌క్తులు గ్యాస్ లీకై చ‌నిపోతారు. ఆ ప్ర‌మాదం గురించి స్టూడెంట్ లీడ‌ర్ అయిన హీరో ఆరా తీస్తూ అన్వేష‌ణ చేస్తూ వెళితే ఓ షాకింగ్ విష‌యం తెలుస్తుంద‌ని, అప్పుడు హీరో ఏం చేశాడ‌నేదే క‌థంటూ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్త‌లు. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే 2022 వ‌ర‌కు ఆగాల్సిందే. 


Advertisement
Advertisement
Advertisement