Abn logo
Apr 7 2020 @ 19:53PM

టైటిల్ లీక్‌పై ‘ఏఏ20’ టీమ్ గరంగరం

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఏఏ20’గా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 8, ఉదయం 9 గంటలకు ఈ అప్‌డేట్ ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే పుట్టినరోజు విడుదలకావాల్సిన ఈ అప్‌డేట్ ముందుగానే సోషల్ మీడియాలో దర్శనమిచ్చేసింది. ఈ చిత్రంలో బన్నీ నటించే పాత్ర పేరుని ఈ సినిమాకి టైటిల్‌గా పెడుతున్నారనే వార్తలు బయటికి వచ్చేశాయి. ‘పుష్పక్ నారాయణ్’ అనే పాత్రలో నుంచి ‘పుష్ప’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్లుగా వార్తలు దర్శనమివ్వడంతో చిత్రయూనిట్ ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది.


అల్లు అర్జున్ పుట్టినరోజున అభిమానులను థ్రిల్ చేయాలని చూసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఈ లీక్‌తో గరంగరంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ లీక్‌కి కారణమైన వారిని పట్టుకుని దండించాలనే నిర్ణయానికి వారు వచ్చారట. మరి ఈ లీక్‌కి కారణమైన వారు ఎవరో? లీక్ చేయడానికి గల ఉద్దేశ్యం ఏమిటో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement