గుండెపోటుతో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

ABN , First Publish Date - 2022-07-04T05:20:27+05:30 IST

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందాడు ఆదివారం ఉదయం ఇంట్లో సైకిల్‌ తొక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

గుండెపోటుతో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి
తేజవిష్ణువర్థన్‌రెడ్డి

పుంగనూరు, జూలై 3: గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందాడు.  పుంగనూరు పట్టణంలోని మేలుపట్లకు చెందిన తేజ విష్ణువర్థన్‌ రెడ్డి(27) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మూడు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన లావణ్యతో వివాహం జరిగింది. ఆషాఢ మాసం కావడంతో గత వారం లావణ్య పుట్టింటికి వెళ్లింది. తేజవిష్ణువర్థన్‌ ప్రతి రోజూ వ్యాయమం చేయడం అలవాటు. ఆదివారం ఉదయం ఇంట్లో సైకిల్‌ తొక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబీకులు డాక్టర్‌ను పిలిపించే లోపే మృతి చెందాడు. 

Updated Date - 2022-07-04T05:20:27+05:30 IST