32 ఏళ్ల కొడుకు ప్రవర్తనలో విపరీత మార్పులు.. ఏమైందని అడిగితే అసలు నిర్వాకం తెలిసి నోరెళ్లబెట్టిన తల్లిదండ్రులు..

ABN , First Publish Date - 2022-02-12T01:02:41+05:30 IST

అతడికి 32ఏళ్లు. చిన్నతనం నుంచి బాగా చదవి.. ఉన్నత చదువులు పూర్తి చేశాడు. తర్వాత మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లో జాబ్ సంపాదించాడు. ఈ క్రమంలో కొడుక్కి పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రలు భా

32 ఏళ్ల కొడుకు ప్రవర్తనలో విపరీత మార్పులు.. ఏమైందని అడిగితే అసలు నిర్వాకం తెలిసి నోరెళ్లబెట్టిన తల్లిదండ్రులు..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 32ఏళ్లు. చిన్నతనం నుంచి బాగా చదవి.. ఉన్నత చదువులు పూర్తి చేశాడు. తర్వాత మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లో జాబ్ సంపాదించాడు. ఈ క్రమంలో కొడుక్కి పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రలు భావించారు. ఇంతలో కొడుకు ప్రవర్తలో విపరీత మార్పులు గమనించి కంగారు పడ్డారు. తర్వాత అతడు చేసిన పని తెలుసుకుని నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఢిల్లీకి చెందిన యువకుడికి ప్రస్తుతం 32ఏళ్లు. ప్రస్తుతం ఆ యువకుడు ఢిల్లీలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుక్కి 32ఏళ్లు రావడంతో అతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగానే కొడుకు ప్రవర్తనలో విపరీత మార్పులు చూసి తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఒంటరిగా కూర్చుని ఏడవటం, ఉన్నట్టుండి కోప్పడటం, చిరాకుపడటాన్ని గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత విషయాన్ని ఆరా తీశారు. ఈ క్రమంలోనే భయంకరమైన నిజాన్ని విని విస్తుపోయారు. ‘నా ఆఫీస్‌లో పని చేసే మధ్యప్రదేశ్ మహిళకు 30ఏళ్లు. రెండేళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు కూతురు కూడా ఉంది. అయినా ఆమెపై మనసు పడ్డాను. పెళ్లి చేసుకుంటానని నా మనసులో మాటను ఆమె వద్ద బయటపెట్టాను. అయితే అందుకు ఆమె ఒప్పులేదు. తన భర్త స్థానంలో మరెవరినీ ఊహించుకోలేనని తేల్చి చెప్పింది. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నా. మహిళగా మారి.. జీవితాంతం ఆమెతో కలిసి ఉండాలని డిసైడ్ అయ్యాను. ఇందులో భాగంగానే లింగ మార్పిడి కోసం నెల రోజులుగా చికిత్స తీసుకుంటున్నా’ అని ఆ యువకుడు చెప్పడంతో అతడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత వెంటనే తమ కొడుక్కి చికిత్స చేసే డాక్టర్‌ను సంప్రదించారు. చికిత్స నిలిపి వేయాలని కోరారు. 



అంతేకాకుండా ఆ యువకుడిని ఓ లాయర్ దగ్గరకు తీసుకెళ్లారు. కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు. పెద్దగా ఫలితం లేకపోవడంతో.. కౌన్సిలర్ సదరు మహిళను కూడా పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఎంత చెబుతున్నా అతడు వినిపించుకోలేదు. పిచ్చొడిలా వెంటబడ్డాడు. లింగ మార్పిడి వొద్దని చెప్పినా.. నా మాటలు పట్టించుకోలేదు. నా భర్త స్థానంలో మాత్రం ఎవ్వరినీ ఊహించుకోలేను’ అని తేల్చి చెప్పేసింది. కాగా.. ఆ యువకుడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం అమగ్యగోచరంగా తయారైంది. లింగ మార్పిడి చికిత్స ఇంకా పూర్తికాకపోవడం వల్ల.. ప్రస్తుతం అతడి శరీరంలో స్త్రీ, పురుష హార్మోన్లు రెండూ ఉత్పత్తి అవుతున్నాయి.




Updated Date - 2022-02-12T01:02:41+05:30 IST