లాక్‌డౌన్‌లో మూగ‌జీవాల ర‌క్ష‌కుడు ఆ యువ‌కుడు!

ABN , First Publish Date - 2020-06-02T16:11:18+05:30 IST

కరోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌లో పేద‌ల‌కు, వ‌ల‌స కూలీల‌కు అటు ప్ర‌భుత్వం, ఇటు సామాజిక సంస్థ‌లు ఆహారాన్ని అందించాయి. అయితే ఇదే లాక్‌డౌన్ స‌మ‌యంలో మూగ జీవాల‌ను ప‌ట్టించుకునే ...

లాక్‌డౌన్‌లో మూగ‌జీవాల ర‌క్ష‌కుడు ఆ యువ‌కుడు!

జైపూర్: కరోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌లో పేద‌ల‌కు, వ‌ల‌స కూలీల‌కు అటు ప్ర‌భుత్వం, ఇటు సామాజిక సంస్థ‌లు ఆహారాన్ని అందించాయి. అయితే ఇదే లాక్‌డౌన్ స‌మ‌యంలో మూగ జీవాల‌ను ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. అయితే రాజ‌స్థాన్‌లోని జైపూర్‌న‌కు చెందిన ఒక యువకుడు 70 రోజుల పాటు జంతువులకు ఆహారం అందించాడు. ఇందుకోసం తన సొంత డబ్బును ఖర్చు చేశాడు. దీంతో వన్యప్రాణి ప్రేమికుడు వీరెన్ శర్మను స్థానికులంతా మెచ్చుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కోతులు, కుక్కలు, ఆవులు, ఇతర జంతువులకు ఆహారం అందించేందుకు వీరెన్ శర్మ వివిధ‌ గ్రామీణ ప్రాంతాలలో తిరిగాడు. విరెన్ శర్మ ప్రతిరోజూ శున‌కాల కోసం 600 ఫుడ్ ప్యాకెట్లను సిద్ధం చేశాడు. త‌న స్నేహితుల‌తో పాటు వివిధ ప్రాంతాల‌కు వెళ్లి ఆ  ఆహారాన్ని వాటికి అందించాడు. అలాగే ఆవులకు పశుగ్రాసం,  కోతులకు అరటిపండ్లు అందించాడు. ఈ మూగ‌జీవాల‌ను ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని వీరెన్ ఆరోపించాడు.

Updated Date - 2020-06-02T16:11:18+05:30 IST