ఇంటర్నెట్ డెస్క్: అతడికి ప్రస్తుతం 32ఏళ్లు. కొత్తగా కడుతున్న ఇంటిని చూసొస్తానని చెప్పి బుధవారం పొద్దున ఇంట్లోంచి బయల్దేరాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటినా అతడు ఇంటికి చేరుకోలేదు. దీంతో అతడి తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు బయల్దేరి వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాక ఇంటి తలుపుతు లోపల నుంచి లాక్ చేసి ఉన్నట్టు గమనించాడు. ఈ నేపథ్యంలో కిటికీ నుంచి ఇంట్లోకి చూశాడు. అనంతరం అక్కడ కనిపించిన సీన్ చూసి షాకయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అవగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని బరాన్కు చెందిన హేమ్రాజ్ వైష్నవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మాంగ్రోల్ రోడ్ బైపాస్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఉత్తమ్ కాలనీలో ఈయన మరో ఇల్లు నిర్మాణంలో ఉంది. కాగా.. నిర్మాణంలో ఉన్న ఇంటిని చూసొస్తానని చెప్పి హేమ్రాజ్ కుమారుడు దినేశ్ బుధవారం ఉదయం బయటికెళ్లాడు. అలా వెళ్లిన అతడు.. అర్ధరాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో హేమ్రాజ్ అనుమానం వ్యక్తం చేశాడు. నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు బయల్దేరాడు. అనంతరం ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నట్టు గుర్తించాడు.
ఇంట్లో దినేశ్ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు కిటికీ నుంచి లోపలికి చూశాడు. ఈ క్రమంలో లోపల ఆయనకు షాకింగ్ సీన్ కనిపించింది. దినేశ్ ఉరితాడుకు వేలాడటం చూసి హేమ్రాజ్ షాకయ్యాడు. ఈ నేపథ్యంలో పెద్దగా ఏడుస్తూ తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో చుట్టుపక్కల వారికి విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఇవి కూడా చదవండి