ఇంటర్నెట్ డెస్క్: ఒకే దగ్గర పని చేస్తున్న ఇద్దరు యువకుల మధ్య తొలుత పరిచయం ఏర్పడింది. అనంతరం అది స్నేహంగా మారింది. చివరికి వాళ్లిందరూ ప్రేమలో పడ్డారు. కొన్ని రోజులపాటు లవ్‌ను ఎంజాయ్ చేశారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఓ యవకుడు తన జెండర్‌నే మార్చేసుకుని.. స్నేహితుడిని వివాహం చేసుకున్నాడు. కాగా.. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సుమారు మూడు సంవత్సరాల క్రితం పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రవి, అర్జున్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఒకే దగ్గర పని చేస్తుండటంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. చివరికి అదికాస్తా ప్రేమగా మారింది. కొన్ని రోజలు గాఢంగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళి చేసుకుని ఒకటవ్వాలని భావించారు. ఇందులో భాగంగానే రవి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తన జెండర్‌నే మార్చుకుని రియాగా మారాడు. అనంతరం అర్జున్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి అర్జున్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో.. సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లైన కొత్తలో ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. కానీ కొద్ది రోజులుగా అర్జున్ ప్రవర్తనలో క్రమంగా మార్పులు వచ్చాయి. రియాను దూరం పెడుతూ వచ్చాడు. తాజాగా తన జీవితం నుంచి వెళ్లి పోవాల్సిందిగా రియాను కోరాడు. దీంతో రియా తీవ్ర భావోద్వేగానికి గురైంది. అంతేకాకుండా ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తనకు అర్జున్‌తో కలిసి బతకాలని ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రాంభించారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి