Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాఫీ షాపులో షాకింగ్ సీన్.. ఓ కుర్రాడితో కేబిన్‌లోకి వెళ్లిన యువతి.. రెండు గంటల తర్వాత సడన్‌గా..

ఇంటర్నెట్ డెస్క్: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి 21ఏళ్ల యువతి కాఫీ షాపునకు వెళ్లింది. ఆ తర్వాత రెండు గంటలపాటు ఆ యువతి, యువకుడు కాఫీ‌షాపులోనే గడిపారు. అనంతరం ఓ షాకింగ్ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఒడిశాకు చెందిన సుశాంత్ సాహూ కొన్నేళ్ల క్రితం తన భార్యతో సహా ఉపాధి కోసం గుజరాత్ వెళ్లాడు.  సుశాంత్ సాహూకు మధుస్మిత అనే 21ఏళ్ల కూతురు కూడా ఉంది. ప్రస్తుతం మధుస్మిత స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో బీ.ఎడ్ చదువుతోంది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లిన మధుస్మిత.. సాయంత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పక్కనే ఉన్న కాఫీ షాపులోకి వెళ్లింది. ఆ తర్వాత  రెండు గంటలపాటు కాఫీషాపులోనే గడిపింది. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా మధుస్మిత స్పృహతప్పి కిందపడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె బాయ్‌ఫ్రెండ్.. మధుస్మిత గురించి కాఫీ‌షాప్ సిబ్బందికి చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. 


ఈ నేపథ్యంలో కాఫీ షాపు సిబ్బంది.. ఆంబులెన్సుకు ఫోన్ చేసి.. మధుస్మితను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించి వైద్యులు.. మధుస్మిత మృతిచెందినట్టు స్పష్టం చేశారు. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతేకాకుండా మధుస్మిత.. బాయ్‌ఫ్రెండ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడే తన కూతురికి విషం ఇచ్చి ఉంటాడని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement