గుడికి వెళ్లిన యువతి.. అక్కడ ఫోన్‌లో అలా చేయడంతో మొదలైన రచ్చ.. చివరికి ఎంత వరకూ వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2021-10-10T21:24:48+05:30 IST

అందరిలానే గుడికి వెళ్లిన ఆమె.. దర్శనం పూర్తైన తర్వాత తిన్నగా తిరిగి రాలేదు. మొబైల్ ఓపెన్ చేసి, నానా హంగామా చేసింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పో

గుడికి వెళ్లిన యువతి.. అక్కడ ఫోన్‌లో అలా చేయడంతో మొదలైన రచ్చ.. చివరికి ఎంత వరకూ వెళ్లిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: అందరిలానే గుడికి వెళ్లిన ఆమె.. దర్శనం పూర్తైన తర్వాత తిన్నగా తిరిగి రాలేదు. మొబైల్ ఓపెన్ చేసి, నానా హంగామా చేసింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అదికాస్తా వైరల్ కావడంతో రచ్చ మొదలైంది. గుడిలో ఆమె చేసిన పనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ విషయం ప్రధాన పూజారి వరకూ వెళ్లడందో ఆమె చేష్టలను ఆయన ఖండించారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 



మధ్యప్రదేశ్‌కు చెందిన మనీషా రోషన్ అనే యువతి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టా‌గ్రాంలో ఆమెకు సుమారు 5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం మనీషా రోషన్.. స్థానికంగా ఉన్న మహంకాళి టెంపుల్‌ను సందర్శించారు. అక్కడ అమ్మవారిని సందర్శించుకున్న ఆమె.. ఆ తర్వాత తిన్నగా తిరిగి రాలేదు. ఫోన్ తీసి.. ఓ సినిమా పాటను ప్లే చేసింది. అంతేకాకుండా ఆ పాటకు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. వీడియో రికార్డు చేసింది. అనంతరం తన ఫాలోవర్లను ఉత్సాహపరిచేందుకు ఆ వీడియోను ఇన్‌స్టా‌గ్రాంలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్తా.. వైరలైంది. ఈ క్రమంలోనే విషయం.. ఆ ఆలయం ప్రధాన పూజరి దృష్టికి చేరింది. దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇకపై గుడిలోకి రాకుండా ఆమెపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. 




Updated Date - 2021-10-10T21:24:48+05:30 IST