Abn logo
Oct 9 2021 @ 15:13PM

Viral Video: రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ మహిళ.. ఉన్నట్టుండి అలా చేయడంతో అవాక్కైన ఇతర కస్టమర్లు

ఇంటర్నెట్ డెస్క్: స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ మహిళ.. ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసుకుని.. ఇతర కస్టమర్లు ఆశ్చర్యపోయారు. ఆ మాత్రం దానికే ఆమె అలా ప్రవర్తించాలా అని గునుక్కున్నారు. అంతేకాకుండా ఆమె చేష్టలకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో స్పందిస్తున్న నెటిజన్లు.. సదరు మహిళపై మండిపడుతున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 


అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్  ఔట్‌లెట్ తాజాగా ఓ మహిళ సందర్శించింది. అనంతరం అక్కడ ఉన్న సిబ్బందిని కాఫీ తెమ్మని అడిగింది. ఈ క్రమంలో స్పందించిన సిబ్బంది.. ఐదు నిమిషాల సమయం పడుతుందని ఆమెకు బదులిచ్చారు. ఆమె దానికి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో సుమారు.. ఐదు నిమిషాలపాటు కాఫీ కోసం వేచి చూసింది. అయితే చెప్పిన సమయానికి ఆమెకు కాఫీని అందించడంలో మెక్‌డొనాల్డ్ విఫలమయ్యారు. దీంతో ఆమెకు కోపం తన్నుకొచ్చింది. ఈ క్రమంలో సదరు మహిళ.. కౌంటర్ దగ్గరకు వెళ్లి, పెద్ద పెద్ద కేకలు పెట్టుకుంటూ అక్కడున్న వస్తువులను కిందకు తోసేసింది. ఆమె ప్రవర్తను చూసి అక్కడున్న కొందరు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ దృశ్యాలను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారడంతో స్పందిస్తున్న నెటిజన్లు.. సదరు మహిళపై మండిపడుతూ కామెంట్ చేస్తున్నారు. ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...