గ్రీకుకు చెందిన ఓ మహిళ.. రెండోసారి ఎవరిని పెళ్లి చేసుకుందంటే!

ABN , First Publish Date - 2020-04-06T00:16:21+05:30 IST

గ్రీకుకు చెందిన ఓ మహిళ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి. కొన్ని కారణాల వల్ల ఆమె తన మొదటి భర్త నుంచి విడిపోయింది. తాజాగా రెండో పెళ్లి చేసుకుంది. అయితే

గ్రీకుకు చెందిన ఓ మహిళ.. రెండోసారి ఎవరిని పెళ్లి చేసుకుందంటే!

ఏథెన్స్: గ్రీకుకు చెందిన ఓ మహిళ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి. కొన్ని కారణాల వల్ల ఆమె తన మొదటి భర్త నుంచి విడిపోయింది. తాజాగా రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఏంటి ఇప్పుడు.. అనుకుంటున్నారా? ఆమె రెండోసారి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే మీరు షాకవుతారు. మొదటి వివాహంలో ఆమెతో కలిసి డ్యాన్స్ చేసిన వెయిటర్‌ను.. ఆ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. వివరంగా చెప్పాలంటే.. 


గ్రీకుకు చెందిన 37ఏళ్ల నటాలీ పెర్రీ.. క్రీట్ ద్వీపంలోని ఓ రెస్టారెంట్‌లో 2012లో ఓ వ్యక్తిని వివాహమాడింది. వివాహ వేడుకల్లో భాగంగా.. అతిథులో కలిసి ఆమె ఓ సాంప్రదాయ నృత్యం చేసింది. ఇదే సమయంలో అందులో పని చేస్తున్న వియిటర్ ఫ్రెడ్‌తో కూడా నటాలీ ఫెర్రీ స్టెప్పులేసింది. ఇదిలా ఉంటే.. కొన్ని కారణాల వల్ల 2016లో ఆమె.. తన భర్త నుంచి విడిపోయింది. అప్పటికి ఆ మహిళకు ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం.. క్రీట్ ద్వీపంలోని అదే రెస్టారెంట్‌కు ఆమె వెళ్లింది. రెస్టారెంట్‌లో వెయిటర్‌గానే కొనసాగుతున్న ఫ్రెడ్.. నటాలీ ఫెర్రీని గుర్తుపట్టాడు. అంతేకాకుండా వెళ్లి ఆమెను పలకరించాడు. ఇద్దరు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది.. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ ఫ్రిబ్రవరిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వివాహం సందర్భంగా ఇద్దరు కలిసి మళ్లీ స్టెప్పులేశారు. కాగా.. ఫ్రెడ్‌తో తన రెండు వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని నటాలీ ఫెర్రీ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-04-06T00:16:21+05:30 IST