Viral News: నెలలుగా యువతి సహజీవనం.. మనిషితో మాత్రం కాదండోయ్!

ABN , First Publish Date - 2022-03-11T16:35:29+05:30 IST

ఓ యువతికి లుఫ్ఫాన్క్స్ చాలా ఇష్టం. గత కొన్ని రోజులుగా లుఫ్ఫాన్క్స్‌తో సహజీవం కూడా చేస్తోంది. లుఫ్ఫాన్క్స్ బెడ్‌పై లేకుంటే రాత్రి ఆమెకు నిద్రపట్టదు. ఉదయాన్నే కిస్ చేయందే ఆమెకు తెల్లారదు. ఓ రకంగా

Viral News: నెలలుగా యువతి సహజీవనం.. మనిషితో మాత్రం కాదండోయ్!

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువతికి లుఫ్ఫాన్క్స్ చాలా ఇష్టం. గత కొన్ని రోజులుగా లుఫ్ఫాన్క్స్‌తో సహజీవం కూడా చేస్తోంది. లుఫ్ఫాన్క్స్ బెడ్‌పై లేకుంటే రాత్రి ఆమెకు నిద్రపట్టదు. ఉదయాన్నే కిస్ చేయందే ఆమెకు తెల్లారదు. ఓ రకంగా లుఫ్ఫాన్క్స్‌తో ఆమె సహజీవనం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రేమలో ఇవన్నీ సహజమే అంటారా? అవును నిజమే. ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకన్నప్పుడు ఇవన్నీ కామనే. పెద్దగా ఎవరూ పట్టించుకోరు కూడా. కానీ ఆ యువతి ప్రేమించే వ్యక్తి మనసు కాదుకదా.. అసలు ప్రాణమే లేదు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే నిజం. ఎందకంటే ఆమె ప్రేమించేది మనిషిని కాదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆమె పేరు సాండ్రా. హంగేరీలోని బుడాపేస్ట్‌లో నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ప్రేమ సాగరంలో మునిగి తేలింది. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి క్రమంగా గొడవలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రియుడు సాండ్రాకు బ్రేకప్ చెప్పేసి, తన దారి తాను చూసుకున్నాడు. అప్పటి నుంచి సాండ్రా ఒంటరైపోయింది. మరొకరికి దగ్గర కాలేకపోయింది. తనకు కలిగిన అనుభవం దృష్ట్యా.. మనుషుల్లో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చేసింది. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడే విమానం బొమ్మను సుమారు రూ.60వేలు పెట్టి గత జనవరిలో కొనుగోలు చేసింది. తర్వాత దానితో ఆమె ప్రేమలో పడింది. ఆ బొమ్మ విమానానికి ముద్దగా లుఫ్ఫాన్క్స్‌ అని పిలుచుకుంటూ దాన్ని తన బాయ్ ఫ్రెండ్‌గా ఫీలవుతోంది. 




Updated Date - 2022-03-11T16:35:29+05:30 IST