ఉద్యోగరీత్యా సిటీలో కొడుకు.. పెళ్లికి వెళ్లి అర్ధరాత్రి తిరిగొచ్చిన అత్తమామలు.. కోడలి గది తలుపులు మూసేసి ఉండటంతో డౌట్.. చివరకు..

ABN , First Publish Date - 2021-11-20T22:27:02+05:30 IST

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే అతడు.. తన భార్యను ఇంటి దగ్గరే వదిలి, ఉద్యోగరీత్యా సిటీకి వెళ్లాడు. ఈ క్రమంలో ఆమె.. అత్తమామలతోనే కలిసి గ్రామంలో ఉంటోంది. అయితే తాజాగా కోడలిని ఒంట

ఉద్యోగరీత్యా సిటీలో కొడుకు.. పెళ్లికి వెళ్లి అర్ధరాత్రి తిరిగొచ్చిన అత్తమామలు.. కోడలి గది తలుపులు మూసేసి ఉండటంతో డౌట్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే అతడు.. తన భార్యను ఇంటి దగ్గరే వదిలి, ఉద్యోగరీత్యా సిటీకి వెళ్లాడు. ఈ క్రమంలో ఆమె.. అత్తమామలతోనే కలిసి గ్రామంలో ఉంటోంది. అయితే తాజాగా కోడలిని ఒంటరిగా ఇంట్లోనే వదిలిపెట్టి.. వాళ్లు(అత్తామామ) ఓ శుభకార్యం నిమిత్తం పక్కనే ఉన్న ఊరికి వెళ్లి, రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అనంతరం కోడలి గది తలుపులు మూసేసి ఉండటాన్ని వాళ్లు గమనించారు. తర్వాత ఏం చేశారనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌కు చెందిన వందన అనే మహిళకు గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులపాటు భార్యతోనే కలిసి ఉన్న అతడు.. ఆ తర్వాత ఉద్యోగరీత్యా వందనను గ్రామంలోనే వదిలిపెట్టి ఢిల్లీకి వెళ్లిపోయాడు. దీంతో ఆమె తన అత్తామామలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రోజు వందనను ఒంటరిగా ఇంట్లోనే వదిలి.. వాళ్లు పక్క గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వెళ్లారు. శుభకార్యం ముగిసిన తర్వాత రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కోడలి గది తలుపులు మూసేసి ఉండటాన్ని వాళ్లు గమనించారు. 



అనంతరం గది వద్దకు వెళ్లి.. ఆమెను పిలిచారు. లోపలి నుంచి ఎటువంటి శబ్దం లేకపోవడంతో వారికి డౌటొచ్చింది. వెంటనే పోలీసులకు, వందన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆమె గది తలపులను బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో గదిలోపల వందన ఉరి వేసుకుని.. విగత జీవిగా వేలాడుతున్న దృశ్యాలను చూసి వాళ్లు కంగుతిన్నారు. కాగా.. వందన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వందన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. కూతురి మరణంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు. 




Updated Date - 2021-11-20T22:27:02+05:30 IST