ప్రసవ వేదన భరించలేక బావిలో పడ్డ ఆవు

ABN , First Publish Date - 2020-06-07T16:02:38+05:30 IST

ప్రసవ వేదన భరించలేక నొప్పులతో పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలోపడి ఆవు ప్రాణాలు విడిచింది.

ప్రసవ వేదన భరించలేక బావిలో పడ్డ ఆవు

చిత్తూరు జిల్లా: ప్రసవ వేదన భరించలేక నొప్పులతో పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలోపడి ఆవు ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. కుప్పం మండలానికి చెందిన రైతు చిన్నప్పయ్యకు చెందిన ఆవు నిండు చూలాలు. పొలం వద్ద మేతకు వదిలిన సమయంలో ఆవుకు నొప్పులు అధికమయ్యాయి. ఆ నొప్పులు భరించలేక అదుపుతప్పి నీరులేని బావిలో పడిపోయింది. వెంటనే రైతు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. 


అగ్నిమాపక సిబ్బంది శ్రమించి బావిలోంచి ఆవును బయటకు తీశారు. కానీ అప్పటికే ఆవు మృతి చెందింది. గర్భంలో ఉన్న దూడ కూడా చనిపోయి బయటకు వచ్చింది. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. రైతు బాధ తట్టుకోలేక ఆవును, దూడను బావి పక్కనే సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు చేశాడు.

Updated Date - 2020-06-07T16:02:38+05:30 IST