Abn logo
Apr 23 2021 @ 01:14AM

నేతల మధ్య మాటల యుద్ధం

- ఎమ్మెల్యే దాసరి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే చింతకుంట

- ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

- తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు

- నియోజకవర్గంలో చర్చనీయాంశమైన వివాదం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి చుట్ట్టుపక్కల అనుమతులు లేకుండానే వెంచర్లను ఏర్పాటుచేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సాగిస్తున్న అక్రమ దందా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మె ల్యే మధ్య వార్‌కు దారితీసింది. అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అవినీతికి పాల్ప డ్డారంటూ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేసిన ఆరోపణ లను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద డబ్బు లు తీసుకున్నట్లు నిరూపిస్తే జెండా చౌరస్తా వద్ద మెడలో చెప్పులు వేసు కుంటానని, లేకుంటే విజయ రమణా రావు చెప్పుల దండ వేసుకుని రాజకీ య సన్యాసం పుచ్చుకుంటారా అని స వాల్‌ విసిరారు. చీకట్లో డబ్బులు తీసు కున్న వాటికి రుజువులు ఉంటాయా, వంద ఎక రాల భూముల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగితే ము న్సిపాలిటీకి ఇంచు స్థలమైనా స్వాధీనం చేశారా, దీనిని ఏమంటారని, తడి బట్టలతో హనుమాన్‌ గుడిలో ప్రవేశిద్దామా? అందుకు సిద్ధమా? అలా కాకుంటే ఎక్కడికి రావాలో చెప్పాలంటూ విజయ రమణారావు ఎమ్మెల్యేకు ప్రతి సవాల్‌ విసిరారు. వీరిద్దరి మధ్య సాగు తున్న పొలిటికల్‌ వార్‌ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 

పుట్టగొడుగుల్లా వెంచర్లు..

అసలు ఈ వార్‌కు కారణమేమిటీ..? అసలు పెద్దపల్లిలో ఏం జరుగు తున్నదనే విషయం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. పెద్దపల్లి జిల్లాగా ఏర్పాటు కావడంతో పెద్దపల్లి పట్టణం చుట్టుపక్కల గల రంగంపల్లి, పెద్దకల్వల, చందపల్లి, బంధంపల్లి, కూనారం, మంథనిరోడ్‌, అప్పన్న పేట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున రియల్‌ వెంచర్లు ఏర్పడ్డాయి. సుమారు 150 ఎకరాల వరకు గల వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లుగా మార్చి గత రెండేళ్ల నుంచి క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవాలం టే ముందుగా నాలా కన్వర్షన్‌ చేయాలి. రియల్‌ వ్యాపారం కోసమైతే డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అనుమతులను తీసుకోవాలి. ఇందుకు గాను డీటీ సీపీ నిర్ధేశించిన ప్రకారం అంతర్గత రోడ్లు వేసి మురికి కాలువలు నిర్మించి, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసి, మున్సిపాలిటీకి గానీ, గ్రామపంచాయతీ గానీ కాలనీ సామాజిక అవస రాలకు 10 శాతం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలి. కానీ ఆ నిబంధనలు పట్టని రియల్‌ ఎస్టేట్‌వ్యాపారులు ఇష్టా రాజ్యంగా రోడ్లు తీసి అమాయక ప్రజలకు ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తారు. డీటీసీపీ అనుమతులు లేనిదే రిజిస్ట్రేషన్లు చేయవద్దని పెద్దపల్లి, సులా ్తనాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్ల నుంచి, డీపీఓ నుంచి లేఖలు రాశారు. దీంతో గత ఏడాది మార్చి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా డీటీసీపీ అనుమతులు లేని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ఉత్తర్వులు జారీచేసింది. 

పెదవి విప్పని అధికారులు..

ధరణి వెబ్‌సైట్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఉండడంతో డిసెం బర్‌ నెలాఖరు నుంచి పాత పద్ధతి లోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. డాక్యుమెంట్‌టు డాక్యుమెంట్‌ ఉన్న భూములను, గుంటల్లో గాకుండా గజాల్లో ఉన్న వాటిని, ఒక డాక్యు మెంట్‌లో ఉన్న భూమిని ఒక రిజి స్ట్రేషన్‌ మాత్రమే చేయాలని, భాగా లుగా విడగొట్టి చేయరాదని ప్రభు త్వం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందుకు విరుద్ధం గా పెద్దపల్లి సబ్‌సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయంలో పెద్దఎత్తున రిజిస్ట్రేష న్లు చేస్తున్నారని, ఈ క్రమంలో డ బ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు నెలరోజులుగా వస్తున్నా యి.  ఈ వ్యవహారంపై పత్రికలు, మీడియాలో కథనాలు వస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఇప్పటివరకు పెదవి విప్పలేదు. ఆ కథనాలు నిరాధారం అని కూడా ఖండించలేదు. డీటీసీపీ అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా ప్లాట్లు చేసి విక్రయాలు జరపరాదంటూ ప్రభుత్వం గత ఏడాది రిజిస్ట్రేషన్ల ను నిలిపి వేసినప్పటికీ, ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించు కోకపోవడం గమనార్హం. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామ పంచాయతీ శివారులో కొత్తగా ఏర్పడ్డ రియల్‌ వెంచర్‌కు అనుమ తులు లేవని వచ్చిన ఫిర్యాదుల మేరకు వెంటనే స్పందించిన పంచా యతీ సిబ్బంది ఆ వెంచర్‌ హద్దురాళ్లను తొలగించి అనుమతిలేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఎవరు కూడా మోసపోవద్దని పిలుపునిచ్చారు. అదే పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో గడిడిచిన రెండేళ్లలో వెలసిన వెంచ ర్లతో పాటు తాజాగా కొత్త వెంచర్లు పుట్టుకు వస్తున్నా మున్సిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తయినా చూడడం లేదు. ప్రజలు మోసపోతే పోనీ తమకేంటి అన్న విధంగా వ్యవహరిస్తు న్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు మాత్రం ఒకరిపైనొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో పాటు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సాగిస్తున్న దందా అక్రమమా, సక్రమమా అనే విషయమై తేల్చాల్సిన అధికారులు ఇప్పటి కైనా మౌనం వీడాలని, అమా యక ప్రజలు నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement