వృథాగా వృత్తి విద్యా భవనం

ABN , First Publish Date - 2021-06-18T05:29:47+05:30 IST

వృథాగా వృత్తి విద్యా భవనం

వృథాగా వృత్తి విద్యా భవనం
చేవెళ్లలో వృథాగా ఉన్న వృత్తి విద్యా భవనం

  • పట్టించుకోని అధికారులు

చేవెళ్ల: లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ విద్య  భవనం అధికారు ల నిర్లక్ష్యం, పట్టింపు లేని ధోరణి కారణంగా వృథాగా ఉంది. సంవత్సరాల తరబడి వినియోగంలో లేక వృత్తి విద్యా భవనం శిథిలావవస్థకు చేరుకుంటోంది. వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్లలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో గతంలో ప్రభుత్వం వృత్తి విద్యా భవనాన్ని నిర్మించింది. రానురాను వృత్తి విద్యా కోర్సులకు డిమాండ్‌ పడిపోవడంతో విద్యర్థులు సైతం ఆసక్తి చూపక వొకేషనల్‌ కోర్సుల్లో చేరలేదు. ఈ కళాశాలలో వృత్తి విద్య కోర్సు ఒకటి రెండు మాత్రమే కొనసాగుతున్నాయి. కాగా ఈ భవనం కొన్ని ఏళ్లుగా ఖాళీగానే ఉంది. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. కాగా ఉన్నతాధికారులు పట్టించుకునే నాథుడే లేకపోవడంతో లక్షల విలువైన ప్రభుత్వ భవనం ఖాళీగా ఉంటుందని పలువురు స్థానికులు వాపోతున్నారు. 


  • భవనాన్ని వాడుకోకుండా అద్దెకు తీసుకొని చెల్లింపులు ..


ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రెసిడెన్షియల్‌ స్కూ ల్స్‌ కోసం అద్దెభవనాలు అవసరమని ప్రైవేట్‌గా అద్దెకు తీసుకుని రూ.లక్షలు అద్దె చెల్లించే కంటే చేవెళ్లలో ఉన్న వృత్తి విద్యా భవనాన్ని ఉపయోగించుకోవచ్చు అని ప్రజలంటున్నారు. ఈ భవనంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు, భవనాన్ని ప్రైవేట్‌ గోదాములకు సైతం అద్దెకు ఇచ్చినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి భవనాన్ని వినియో గంలోకి తీసురావాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-06-18T05:29:47+05:30 IST