Viral Video: అలసిపోయి సోఫాలో కూర్చున్న నవవధువును ఏం కావాలమ్మా అని అడిగితే.. ఆమె నుంచి ఊహించని సమాధానం..!

ABN , First Publish Date - 2021-12-03T21:24:57+05:30 IST

హిందూ సాంప్రదాయంలో పెళ్లి వేడుక సుదీర్ఘంగా సాగుతుంది. వధూవరులు చాలా ఎక్కువ సమయం పీటల మీద కూర్చుని పూజలు చేయాల్సి ఉంటుంది.

Viral Video: అలసిపోయి సోఫాలో కూర్చున్న నవవధువును ఏం కావాలమ్మా అని అడిగితే.. ఆమె నుంచి ఊహించని సమాధానం..!

హిందూ సాంప్రదాయంలో పెళ్లి వేడుక సుదీర్ఘంగా సాగుతుంది. వధూవరులు చాలా ఎక్కువ సమయం పీటల మీద కూర్చుని పూజలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వధువులు బరువైన పెళ్లి దుస్తులు, నగలు ధరించి పెళ్లి తంతులో పాల్గొంటుంటారు. సుదీర్ఘంగా సాగే ప్రక్రియ కావడంతో కొంత మంది అలసిపోతుంటారు. పెళ్లి తంతుతో అలసిపోయి సోఫాలో కూర్చున్న వధువుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఆ వీడియోలో పరుల్ సేథీ అనే వధువు పూజా కార్యక్రమాలతో అలసిపోయి సోఫాలో కూర్చుని ఉంది. ఆ తర్వాత ఆమె భర్తతో కలిసి అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేయాల్సి ఉంది. పొడవైన లెహంగా, బంగారు నగలు ధరించి నీరసంగా కూర్చున్న పరుల్‌ను ఓ వ్యక్తి `నీకు ఏమి కావాలి?` అని అడిగారు. దానికి ఆమె `నాకు ఇప్పుడు నైట్ డ్రెస్ కావాలి. అది తప్ప ఇంకేం వద్దు` అని సరదాగా సమాధానం ఇచ్చింది. ఈ వీడియోను ఇప్పటివరకు 6 లక్షల మంది చూశారు. `పెళ్లి సమయంలో నాకూ అలాగే అనిపించింద`ని చాలా మంది మహిళలు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేశారు. 



Updated Date - 2021-12-03T21:24:57+05:30 IST